Hair Care Tips for Summer Home Remedies In Telugu

Spoorthi
0

Hair Care In Summer Home Remedies In Telugu

Hair Care Tips for Summer Home Remedies In Telugu

వేసవి కాలంలో కేశాల ఆరోగ్యంకోసం 10 మార్గాలు

వేసవికాలం మరియు చలి కాలంలో కూడా కేశాల ఆరోగ్యం గురించి చాలా ఉద్రిక్తతలకు లొనవుతుంటారు. మీ కేశాల ఆరోగ్యం కోసం ఇక్కడ 10 రకాల మార్గాలు తెలుపబడ్డాయి. వీటిని పాటించటం వలన ఏ కాలంలో అయిన మీ కేశలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

కేశాలను క్రమంగా కత్తిరించండి

మీ కేశాలు ఆరోగ్యంగా ఉండటానికి మంచి మార్గం కత్తిరించటం. వేసవిలో సాధారణంగా జుట్టు పొడిగా నిర్జీవంగా తయారు అవుతుంది, ఈ సమయంలో జుట్టు చివరలను కత్తిరించండి. కేశాలు చూడటానికి అందంగా కనపడటానికి, క్రమంగా కేశాలను అంచులో పావు వంతు కత్తిరించండి. ఫలితంగా ఆరోగ్యకరంగా మరియు పెరుగుదల కూడా మెరుగుపడుతుంది

ప్రత్యామ్నాయంగా తలను కడగండి

వేసవిలో తలపైన చెమట ఎక్కువగా రావటం వలన ఫలితంగా చూండ్రు కూడా ఎక్కువ అవుతుంది. ఇలా తలపైన ఉండే చర్మం దుమ్ము ధూళిలతో అధికం అవటం వలన తలను రోజు శుభ్రపరుస్తుంటాము. కానీ ఇది సరైన ఆలోచన కాదు. రోజు మీ తలను కడగటం వలన తల పైన ఉండే చర్మం సహజ నూనెలను కోల్పోతుంది. కావున, జుట్టును రోజు కాకుండా రెండు రోజులకు ఒక్కసారి కడగటం మంచిది.

కండిషనింగ్

మీ కేశాలకు ప్రతిసారి షాంపూలను వాడటం వలన రీహైడ్రేషన్కు గురవుతాయి. కావున మీ ప్రోటీన్లతో కూడిన కండిషనర్లను వాడటం వలన షాంపూలను వాడటం వలన కలిగే నష్టాన్ని ఇవి భర్తీ చేస్తాయి. సహజ సిద్దమైన హైడ్రేటర్లను అందించే తేమబరిత కండిషనర్లను వాడండి. కానీ అధిక మొత్తంలో ప్రోటీన్లను కలిగి ఉన్న వాటిని వాడటం వలన కేశాలు పొలుసులుగా మారే అవకాశం ఉంది. కావున మీ కేశాలకు వారానికి ఒకసారి మాత్రమె కండిషనర్లను వాడండి.

ఎక్కువగా దువ్వకండి



దువ్వటం వలన కేశాలు పాడయ్యే అవకాశం ఉంది. వేసవిలో ఉండే వేడికి తలపైన ఉండే చర్మం తేమని కోల్పోతుంది ఈ సమయమంలో దువ్వటం వలన కేశాలు ప్రమాదానికి గురవుతాయి. కావున స్నానం చేసిన వెంటనే ఫైబర్తో తయారుచేసిన దువ్వెనలను వాడండి.

ఆరోగ్యకరమైన ఆహరాన్ని తినండి


కేశాలు ఆరోగ్యకరంగా ఉండుటకు అవసరమయ్యే విటమిన్లను అందించండి. ఆరోగ్యకరమైన ఆహరం తినటం వలన కేశాలకు కావలసిన పోషకాలు అందించబడి, ఆరోగ్యంగా ఉంటాయి. మీరు తీసుకునే ఆహరంలో కేశాలను ఆరోగ్యకరంగా ఉంచే విటమిన్ ‘C’, ఐరన్, జింక్ మరియు ఒమేగా-3 ఫాటీ ఆసిడ్లు ఉండేలా చూసుకోండి.

ఉద్దీపనల వాడకం

ఈ వేసవి కాలంలో, ‘యూకలిఫ్టస్’, ‘మెంథాల్మరియు పిప్పరమెంటులేదా మిరియాలనూనెలతో చేసిన షాంపూ మరియు కండిషనర్లను వాడటం మంచిది. మీ చేతి వెళ్ళ కొనలతో ఈ నూనెలను తలపైన మసాజ్ చేయటం వలన వెంట్రుకల మొదల్లలో రక్త సరఫరా మెరుగుపడి కేశాల పెరుగుదల ఆరోగ్యకరంగా ఉంటుంది.

హెయిర్ స్ప్రే

నూతనంగా కనుగొన్న ఈ స్ప్రేలను వాడటం వలన మీ కేశాలు మరింత కాంతివంతంగా కనపడతాయి. ఈ స్ప్రేలు కేశాల పైన ఒక రక్షణ పొరల ఏర్పడి, వేడి నుండి, దుమ్ము-ధూళి మరియు U.V కిరణాల నుండి వచ్చే శక్తివంతమైన కాంతి కిరణాల నుండి కేశాలను కాపాడుతాయి

కేశాలు కడుగుటకు సమయం లేనపుడు


మీ కేశాలను కడగటానికి సమయం లేదు కదా అని అశ్రద్ధ చూపకండి, వెంట్రుకల మూలాలు మరియు తలపైన చర్మంలో ఉండే దుమ్ము, నూనెల వలన దురదలు కలుగుతాయి, కొన్ని సమయాల్లో కేశాలు బలహీనంగా మారి వెంట్రుకలు ఉడిపోయే అవకాశం కూడా ఉంది.

నిమ్మరసం వాడండి

మీరు కొన్ని గంటల సమయం ఎండలో కేటాయించవలసి వస్తే, కేశాలకు కొద్దిగా నిమ్మ రసం రాయండి. మీరు సెలూన్ షాప్కు వెళ్ళవలసిన అవసరం లేకుండా చేస్తుంది.
దయ చేసి అందరికి షేర్ చేసి తెలియచేయండి

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top