How To Remove Unwanted Hair Permanently On Face In Telugu

Spoorthi
0

How To Remove Unwanted Hair Permanently On Face In TeluguHow To Remove Unwanted Hair Permanently On Face In Telugu

ముఖం పై వచ్చే అవాంఛిత రోమాలను తొలగించడానికి ఇంటి చిట్కాలు 

అందమైన ముఖాన్ని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. ప్రస్తుత కాలం లో అవాంచిత రోమాలతో చాలా మంది బాధపడుతున్నారు. అది అందమైన ముఖాన్ని అందవిహీనంగా చేస్తుంది. వాటిని చూసుకున్నప్పుడల్లా స్త్రీ లు ఎంతో బాధని అనుభవిస్తుంటారు. ఈ అవాంచిత రోమాలు అనేది ఒక దీర్ఘకాలిక సమస్య. దీనికి మీరు వాక్సింగ్, షేవింగ్ మరియు ఇతర చికిత్సలు చేయించటం వల్ల క్రమంగా మరింత పెరుగుతాయి. దీనికి శాశ్వత పరిష్కారం అంటూ ఏమి లేదు, కానీ కొన్ని సహజ నివారణలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

పసుపు

ఇది మనం ప్రతి రోజు మన వంటల్లో వాడేదే.. పసుపు లో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు అవాంఛిత రోమాలును తొలగించి ముఖంలో తేజస్సుని, మరియు అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. దీన్ని ఆయుర్వేదం లో ఒక మెడిసిన్ లా ఉపయోగిస్తారు. పసుపుని శెనగపిండి తో కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి, పసుపు రోమాలను తొలగించటమే కాకుండా వాటి పెరుగుదలను కూడా అదుపులో ఉంచుతుంది.

 శెనగపిండి

దీన్ని భారత దేశం లో చాల మంది ముఖానికి మాస్క్ లా ఉపయోగిస్తారు. మన చర్మం పై ఉండే అవాంచిత రోమాలను తొలగించుటలో ఎంతో సహాయ పడుతుంది. శెనగపిండిని కొద్దిగా పసుపు,పెరుగుతో కలిపి ముఖానికి రాసుకుంటే ఎంతో ప్రభావవంతమైన ఫలితాన్ని ఇస్తుంది. సహజ నివారణలు వాడటం వలన ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.

చక్కెర మిశ్రమం

ఇది కొంచం తక్కువ ఖర్చుతో ఇళ్లలో వ్యాక్సింగ్ చేసుకునే ఒక పద్దతి. కొద్దిగా చక్కెర లో కొంచెం తేనె మరియు నిమ్మ రసం కలిపి ఈ మిశ్రమం ముఖం పై రాసుకోవాలి. దీన్ని ఒక క్లాత్ స్ట్రిప్ చేత తొలగించాలి. ఈ ప్రక్రియ అత్యంత సమర్థవంతమైనదే కానీ ఓ మొస్తరు భాధను కలిగిస్తుంది.

ఎగ్ మాస్క్

గుడ్డు లోని తెల్ల సొనను ఒక గిన్నె లో తీసి అందులో ఒక చెంచాడు పంచదార, అర చెంచాడు మొక్కజొన్న పిండి కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. దీన్ని ముఖం పై రాసుకుని కొద్దిసేపు ఆరనివ్వాలి. తర్వాత ఒక మాస్క్ లా మారిన దీన్ని మెల్లగా తిసి వేస్తే దానితో ఈ అవాంఛిత రోమాలు కూడా తొలగిపోతాయి. ఈ పద్ధతి కూడా మంచి ఫలితాలను అందిస్తుంది.
వీటితో పాటుగా ఆరోగ్యకరమైన భోజనం కూడా ముఖ రోమాలు వదిలించుకోవటంలో సహాయపడుతుంది. సాధారణంగా హార్మోన్ల అసమతుల్యత వల్ల ముఖం పై అవాంచిత రోమాలు పెరుగుతుంటాయి. సరియైన భోజనం తీసుకొకపొవడం వలన ఇది అధికమయ్యే ప్రమాదముంది.
ముఖం పై అవాంచిత రోమాలను తగ్గాలంటే ఫైటో ఈస్త్రోజెన్లు అధికంగా ఉన్న ఆహారాన్ని తినాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఫైటో ఈస్త్రోజెన్లు అధికంగా అవిసె గింజలు, సోపు, అల్ఫాల్ఫా లో ఉంటాయి.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top