bald head precautions || Top Tips to Care for a Bald Head

Spoorthi
0
బట్టతల రాకుండా ఉండాలంటే .... 

బట్టతల ఈ మాట వింటేనే భయంగా ఉంది కదా..! ఒక్కొక్క వెంట్రుకా రాలిపోతూంటే అమ్మో ఆ బాధ వర్ణనాతీతం. అయితే ఇప్పుడున్న కాలుష్య వాతావరణంలో జుట్టు ఊడిపోవటం సర్వ సాధారణం అయిపోయింది. బట్టతల పైకి మామూలు సంగతే అయినా… దాని ప్రభావం మన ఆత్మవిశ్వాసం మీద కూడా పడుతుంది. మానసిక పర ఒత్తిడికి కారణం ఔతుంది. ఎన్ని ఆధునిక పద్దతులు వాడి బట్టతలని కవర్ చేసినా అది కవరింగ్ అన్న విషయం తెలిసి పోవటమే కాదు, అది మామూలు జనాలకు చాలా ఖర్చు తో కూడుకున్న వ్యవహారం. మరి ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ జుట్టు రాలటాన్ని అరికట్టే ఉపాయం ఉంటే? అదే ఇప్పుడు చూడండి….. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదూ అని సామెత… ఉల్లిపాయ లోని ఔషద గుణాలు మనకి ఎంతో మేలు చేస్తాయని మన ఆయుర్వేద వైద్యులు ఎప్పుడో గుర్తించారు. ఇప్పుడు జుట్టు ఊడి పోకుండా ఉల్లిపాయ ఎంత ఉపకరిస్తుందో చూడండి.

బట్టతల రాకుండా ఉండాలంటే .. How to Control Hair Fall | Natural Treatment for Bald Head in Telugu

 1. కొన్ని ఉల్లిపాయ‌ల‌ను తీసుకుని వాటిని మెత్త‌ని పేస్ట్‌లా చేయాలి. ఆ పేస్ట్‌ను త‌ల కుదుళ్ల‌కు త‌గిలేలా రాయాలి. త‌ర‌చూ ఇలా చేస్తుంటే త‌ల‌పై ఊడిపోయిన వెంట్రుక‌లు మ‌ళ్లీ పెరుగుతాయి. అంతేకాదు వెంట్రుక‌లు దృఢంగా, ఒత్తుగా ఉంటాయి. ఉల్లిపాయ‌ల్లో ఉండే సల్ఫ‌ర్ అనే మూల‌కం జుట్టు పెరుగుద‌ల‌కు తోడ్ప‌డుతుంది.

 2. ఉల్లిపాయ‌ల‌ను బాగా దంచి ఆ మిశ్ర‌మంలో కొద్దిగా కొబ్బ‌రి నూనె లేదా ఇత‌ర ఏవైనా ఆయిల్స్‌ను క‌లిపి రాసుకోవాలి. దీంతో శిరోజాలు బాగా పెరుగుతాయి. కుదుళ్లు దృఢ‌మై వెంట్రుక‌లు ఆరోగ్యాన్ని, కాంతిని సంత‌రించుకుంటాయి.


 3. ఉల్లిపాయ‌లను మెత్త‌గా దంచి వాటి నుంచి తీసిన ర‌సంలో కొద్దిగా తేనె, నిమ్మ‌ర‌సం క‌లపాలి. ఆ మిశ్ర‌మాన్ని కుదుళ్ల‌కు త‌గిలేలా ప‌ట్టించాలి. అనంత‌రం 30 నిమిషాల పాటు వేచి ఉండాలి. త‌రువాత త‌ల‌స్నానం చేయాలి. రెగ్యుల‌ర్‌గా ఈ టిప్‌ను పాటిస్తే చుండ్రు స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. శిరోజాలు కూడా కాంతివంత‌మ‌వుతాయి. ఈ చిట్కాల‌ను కేవ‌లం స్త్రీలే కాదు, పురుషులు కూడా పాటింవ‌చ్చు. దీంతో చ‌క్క‌ని శిరోజాలు వారి సొంత‌మ‌వుతాయి.
Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top