Telegu Daily Rasi Phalalu 10-05-2019

Spoorthi
0

Telegu Daily Rasi Phalalu 10-05-2019


మేషరాశి :
ఈ రోజు బంధువుల సహకారం లభిస్తుంది.ప్రయాణాల వల్ల జాగ్రత్త అవసరం.తోటి వ్యక్తుల సహకారాలు లభిస్తాయి.రచనలపై దృష్టి తగ్గుతుంది.కమ్యూనికేషన్స్‌ వల్ల అనుకూలత పెరుగుతుంది.పరామర్శలు చేస్తారు. ప్రచారాలపై దృష్టి ఏర్పడుతుంది. 

వృషభరాశి:
ఈ రోజు కుటుంబంలో అనుకోని ఆటంకాలు వస్తాయి.నిల్వ ధనాన్ని కోల్పోతారు.శారీరక శ్రమ కొంత ఉంటుంది.మాట వల్ల ఇబ్బందులు వస్తాయి.జాగ్రత్త అవసరం.అలసట వస్తుంది.అనవసర ఇబ్బందులు వస్తాయి.జాగ్రత్త అవసరం. 

మిథునరాశి:
 ఈ రోజు చిత్త చాంచల్యం అధికంగా ఉంటుంది.సమయం, కాలం,ధనం వృధా అవుతాయి.శారీరక శ్రమ అధికం.ఒత్తిడితో పనులు పూర్తి చేస్తారు.ఆలోచనల్లో మార్పులు వుటాంయి.ప్రణాళికలు అవసరం అవుతాయి.అనుకోని భయాలు ఏర్పడతాయి. 

కర్కాటకరాశి :
ఈ రోజు విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు.ప్రయాణాలపై ఆసక్తి ఉంటుంది. అనవసర ప్రయాణాలు చేస్తారు. మానసిక వ్యధ అధికం. శ్రమ, కాలం,ధనం వృధాఅవుతుంది. మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది.పాదాల నొప్పులు ఉంటాయి. 

 సింహరాశి:
 ఈ రోజు ఊహించని ఇబ్బందులు ఉంటాయి.అనుకోని ఒత్తిడులు వస్తాయి.మానసిక ప్రశాంతత లోపం ఉంటుంది.సంఘ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం.దురాశ ఏర్పడుతుంది.ఇతరులపై ఆధారపడతారు. ఉపాసనపై దృష్టి ఏర్పడుతుంది.నిరంతర జపం అవసరం. 

కన్య రాశి:
 ఈ రోజు ఉద్యోగంలో ఒత్తిడి అధికంగా ఉంటుంది.అధికారులతో అప్రమత్తత అవసరం.సంఘంలో గౌరవంకోసం ఆరాట పడతారు.ఆశించినంత గౌరవం లభించదు.రాజకీయాలపై ఆసక్తి అంతంత మాత్రంగా ఉంటుంది.ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

తులరాశి:
 ఈ రోజు ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి.ఒత్తిడి అధికంగా ఉంటుంది.దూరదృష్టి అధికంగా ఉంటుంది. పరిశోధనలపై ఆసక్తి తగ్గుతుంది.అనుకున్న పనులు తొందరగా పూర్తికావు.ఇతరులపై ఆధారపడతారు. న్యాయ అన్యాయ విచారణ చేస్తారు.కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

వృశ్చికరాశి:
 ఈ రోజు ఇతరులపై ఆధరపడతారు.ఊహించని ఇబ్బందులు ఉంటాయి.అనుకోని ఖర్చులు చేస్తారు. ఊహించని ప్రయాణాలు చేస్తారు.వైద్యశాలల సందర్శనం ఉంటుంది.ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.శ్రమ అధికం అవుతుంది.పరాధీనత ఉంటుంది.పరామర్శలు చేస్తారు. 

 ధనస్సు రాశి:
 ఈ రోజు సామాజిక అనుబంధాల్లో లోపాలు ఉంటాయి.నూతన పరిచయాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. భాగస్వాములతో జాగ్రత్త అవసరం.పదిమందిలో పలుకుబడికోసం ఆరాట పడతారు.వ్యాపారస్తులు అప్రమత్తత అవసరం. 

మకరరాశి:
ఈ రోజు శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది.రోగనిరోధకశక్తి పెరుగుతుంది.ఔషధసేవనం చేస్తారు.నష్టవస్తు పరిజ్ఞానం ఉంటుంది.శారీరక బలం పెరుగుతుంది.పోటీల్లో గెలుపు ఉంటుంది.శతృవులపై విజయం సాధిస్తారు 

కుంభరాశి:
ఈ రోజు మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది.సంతానం వల్ల సమస్యలు ఏర్పడతాయి. ఆత్మీయతలను కోల్పోతారు.సృజనాత్మకత లోపిస్తుంది.దీక్షా సంబంధ ఆలోచనల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది.  

 మీనరాశి:
 ఈ రోజు ఒత్తిడితో సౌకర్యాలు పూర్తి.ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.ఆహారంలో సమయపాలన పాటించాలి. అనవసర ఇబ్బందులు ఎదురౌతాయి.మాతృ సౌఖ్యం తక్కువగా ఉంటుంది.విద్యార్థులకు కఠినమైన సమయం. ఆలోచనల్లో ఒత్తిడి ఏర్పడుతుంది.






Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top