ఆర్టీసీ విషయంలో కేసిఆర్ సంచలన నిర్ణయం ?

Spoorthi
0


ఆర్టీసీ విషయంలో  కేసిఆర్ సంచలన నిర్ణయం ?CM KCR to take key decision over RTC

ఆర్టీసీ విషయంలో కేసిఆర్ సంచలన నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. అసలు ఆర్టీసీనే ఉనికిలో లేకుండా చేయాలని కేసియార్ దాదాపు డిసైడ్ అయినట్లు సంస్ధ వర్గాలు చెబుతున్నాయి.  45 రోజులుగా సమ్మెలో ఉన్న సిబ్బంది వల్ల సంస్ధ దారుణంగా నష్టపోయిందని ఇప్పటికే ప్రభుత్వం అనేక అఫిడవిట్లు వేసింది కోర్టులో.

తాజాగా కోర్టులో వేసిన అఫిడవిట్లో కూడా ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకే ఆర్టీసీ సమ్మె జరుగుతున్నట్లు పేర్కొనటం విచిత్రంగా ఉంది. ప్రతిపక్షాలతో కలిసి ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారనే విధంగా ఉంది అఫిడవిట్. ప్రభుత్వం లేటెస్టుగా దాఖలు చేసిన అఫిడవిట్ చూస్తుంటే అసలు సిబ్బందిలో  ఎవరికి కూడా మళ్ళీ ఉద్యోగం ఇచ్చే ఉద్దేశ్యంలో కేసిఆర్ లేనట్లు తెలిసిపోతోంది.

సమ్మె కారణంగా సిబ్బందికి  సెప్టెంబర్, అక్టోబర్  నెలల  జీతం కూడా చెల్లించలేదు. అంటే ఒకవైపు జీతాలు చెల్లించకుండా మరోవైపు చర్చలకు పిలవకుండా అదే సమయంలో ఉద్యోగంలో చేర్చుకోకుండా మూడు వైపుల నుండి 48 వేల మందిని బాగా బిగించేస్తున్నారు సిఎం. ఇప్పటికే సుమారు 24 మంది సిబ్బంది మరణించిన విషయం అందరికీ తెలిసిందే.

 కేసిఆర్ వైఖరి చూస్తుంటే ఇంకెంతమంది చనిపోయినా సరే కార్మిక యూనియన్లతో చర్చలు మాత్రం జరపకూడదనే గట్టిగా నిర్ణయించుకున్నట్లున్నారు.  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్ పై ఇటు ప్రభుత్వం అటు యూనియన్లు ఇన్నిరోజులు పట్టుబట్టాయి. అయితే గడచిన నాలుగు రోజులుగా ఆర్టీసీని విలీనం అన్న డిమాండ్ ను పక్కన పెట్టేస్తున్నట్లు ప్రకటించింది.
  
 ప్రధాన డిమాండ్ ను యూనియన్లు పక్కనపెట్టేసింది కాబట్టి సమస్య పరిష్కారం అయిపోతుందనే అందరూ అనుకున్నారు. కానీ యూనియన్ నేతల ప్రకటన తర్వాతే ప్రభుత్వం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ చూసిన తర్వాత కేసిఆర్ ఆలోచనేంటో ఎవరికీ అంతుపట్టటం లేదు. హోలు మొత్తం మీద ఏకంగా ఆర్టీసీనే ఉనికిలో లేకుండా చేయటానికి కేసిఆర్ గట్టి నిర్ణయంతో ఉన్నట్లు అర్ధమైపోతోంది.



Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top