ధనప్రాప్తి కోసం ఇలా చేయండి || Lakshmi Devi Kataksham Tips in Telugu

Spoorthi
0

ధనప్రాప్తి కోసం ఇలా చేయండి || Lakshmi Devi Kataksham Tips in TeluguLakshmi Devi Kataksham Tips in Telugu

1.డబ్బు సంబంధించిన పనిమీద ,బయటకు వెళ్ళేముందు మీ గృహ మరియు గ్రామదేవతలకు నమస్కరించి వెళ్ళండి.

2.ఆదివారము వీలైతే సహదేవి వృక్షం వేరుతెచ్చి ఎర్రని గుడ్డలో కట్టి ఇంట్లో పూజా మందిరములో పెట్టండి.

3.మీకు విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఒక మీటరు తెల్లగుడ్డ ,ఐదు గులాబిపువ్వులు తీసుకొని మీ పరిసర ప్రాంతంలో నీళ్ళు పారే కాలువ వద్దకెళ్ళి గుడ్డ పరచి 5 గులాబిపువ్వులు గాయత్రీమంత్రం చదువుతూగుడ్డలో కట్టి కాలువలో వేయండి,

4.బ్యాంకులో డబ్బులు వేసేముందు ఏదైనా లక్మీ మంత్రం స్మరించండి,

5.ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బులు రాకుంటే మఱ్ఱిచేట్టు దగ్గరకు వెళ్ళి రెండు ఊడలను కలిపి ముడివేయండి,వేసేముందు డబ్బులు రాగానే వచ్చి ముడి విప్పుతానని తలచుకోండి..,వచ్చిన తరువాత వెళ్ళి చెట్టు మొదల్లో అగరు వత్తులు ముట్టించి కొంచెం చక్కెర వేసి ముడి విప్పండి,కృతజ్ఞతలు తెలిపి నమస్కారము చేయండి.

6.పదకొండు మంచి గవ్వలు కుంకుమ పువ్వు ని నీళ్ళతో కలిపి గవ్వలకు పట్టించి పసుపు గుడ్డలో చుట్టి డబ్బు పెట్టే చోట పెట్టండి. డబ్బు రావడం జరుగుతుంది

7.ప్రతినెల ఒకరోజు ఏదైనా ఆలయానికి వెళ్ళి ఊడ్వడం నీటితో కడగడం ఇంకా ఏదైనా సేవ చేయండి,

8.ఆకస్మిక ధన ప్రాప్తి కొరకు ఏదైనా స్మశానంలో ఉన్న శివాలయంలో పాలు తేనె సోమవారం నుండి మళ్ళీ సోమవారం వరకు నివేదన చేయండి.

9.మీ వ్యాపార స్థలంలో ఆవుపేడతో చిన్నగా అలికి పసుపుతో త్రికోణమువేసి దానిపై ఆసనము వేసి కూర్చుని ఏదైనా లక్ష్మీ మంత్రం 15 నిమిషాలు చేయడం వల్ల వ్యాపారం అభివృద్దిలో ఉంటుంది.

10.పసుపురంగు గవ్వకి చిన్న రంధ్రం చేసి ఎరుపు దారంతో పిల్లల మెడలో వ్రేలాడదీయడం వల్ల దిష్టి దోషాలు తొలగుతాయి.

11.పావుకేజీ బెల్లం తీసుకుని నీటిలో కలిపి పానకం తయారు చేసి స్మశానంలో ఒక పక్క పోసి రండి.ఎలాంటి దుష్టాత్మలు వేధించవు.

12.ఎంతకూ పని దొరకనపుడు రాత్రి ఒక నిమ్మకాయ నాలుగుముక్కలు కోసి కూడలిలో నాలుగుదిక్కులా వేసిరండి శనివారం నుండి మళ్ళీ శనివారం వరకు .

13.ఎంత వీలయితే ఉదయం లేవగానే ఇష్టదైవాన్ని గృహదేవత గ్రామ దేవతకు నమస్కరించండి.

14.వీలయితే ఏకముఖ రుద్రాక్ష ధరించడం వల్ల దైవికశక్తుల తోడ్పాటు ఉంటుంది. ఙ్ఞానవృద్ది జరుగుతుంది .

15.భార్యా భర్తల మధ్య ప్రేమకై ముంజేతిపై ఎర్రని దారాన్ని కంకణంలా ధరించండి.

Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top