నెలకు రూ.600కే నెట్,ల్యాండ్ లైన్ ఫోన్, కేబుల్ టీవీ: జియో బంపరాఫర్
100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్, అన్‌లిమిడెట్ కాలింగ్‌తో టెలిఫోన్‌తో పాటు టీవీ కనెక్షన్.. ఇవన్నీ కలిపి
నెలకు రూ.600కే ఇచ్చేలా ప్లాన్ చేస్తోంది రిలయన్స్ జియో. మరో రూ.300-400 అదనంగా
చెల్లిస్తే.. కనీసం 40 పరికరాలను కనెక్ట్ చేసుకునే విధంగా స్మార్ట్ హోం నెట్వర్క్‌ను
ఇచ్చేందుకు రిలయన్స్ సంసిద్ధమవుతోందని సంబంధిత వర్గాలు అనధికారికంగా చెబ్తున్నాయి.
ప్రస్తుతం రిలయన్స్ జియోకు చెందిన గిగాఫైబర్ ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ సహా మరికొన్ని ప్రాంతాల్లో నెలకు 100 జిబి డేటాతో 100 ఎంబిపిఎస్‌తో నెట్ కనెక్షన్ సేవలను
అందిస్తోంది. ఇందుకు అవసరమైన రూటర్, ఇన్‌స్టలేషన్ కోసం రూ.4500 ఒన్ టైం డిపాజిట్‌ను తీసుకుంటుంది. అదే రూటర్‌కు మరో మూడు నెలల్లో ల్యాండ్
టైన్ టెలిఫోన్, టీవీ సేవలను కూడా
అందించేందుకు ప్రణాళికలను రెడీ చేసుకుంటోంది. ఇంకో ఎగ్జైటింగ్ విషయం ఏంటంటే..
ఇప్పటికే సుమారు ఆరు నెలల నుంచి ఫ్రీగా నడుస్తున్న ఈ సేవలు మరో ఏడాది పాటు కూడా
ఉచితంగానే లభించవచ్చని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఈ సేవలు అధికారికంగా లాంఛ్
అయ్యేంత వరకూ ఇప్పటివరకూ తీసుకున్న వాళ్లకు ఫ్రీగానే సర్వీసులు అందించేందుకు జియో
సిద్ధంగా ఉంది.
ఫ్రీ ల్యాండ్ లైన్, టీవీ ఛానల్స్
ఇప్పుడు మనం టీవీ ఛానల్స్ కోసం కేబుల్ లేదా డిటిహెచ్‌లను వాడాల్సి వస్తోంది.
త్వరలో రాబోయే జియో టీవీ సేవల ద్వారా ఇకపై ఆ అవసరం ఉండదు. ఎందుకంటే ఆప్టికల్
నెట్వర్క్ టర్మినల్ (ONT) ద్వారా ఇంటర్నెట్ ప్రోటోకాల్‌తో నెట్ ద్వారా టీవీ ఛానల్స్ చూసే అవకాశం ఉంది.
అయితే ఇప్పటి మాదిరి ఛానల్స్ సెలెక్ట్ చేసుకోవాలా లేకపోతే అన్ని ఛానల్స్ ఫ్రీగా
ఇస్తారా అనే అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటివరకూ అందుతున్న సమాచారం
ప్రకారం 600 ఛానల్స్‌తో పాటు వారం రోజుల పాటు రికార్డింగ్ ఆప్షన్ ఉండి మళ్లీ వెనక్కి
తిరిగి చూసుకునే సౌలభ్యం ఉన్న సేవలతో టీవీ సేవలను అందించబోతున్నారు.
వీటికి అదనంగా అన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యంతో ల్యాండ్ లైన్ టెలిఫోన్ కూడా
ఇవ్వబోతోంది రిలయన్స్ జియో.
ఇవన్నీ కలిసి నెలకు రూ.600కే
ఇచ్చేందుకు ప్లాన్స్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. అధికారికంగా రేట్లు ఇంకా బయటకు
చెప్పకపోయినప్పటికీ ఆన్ గ్రౌండ్ టీం సహా టాప్ మేనేజ్మెంట్‌లోని కొంత మంది పేరు
చెప్పేందుకు ఇష్టపడని వ్యక్తులు చెబ్తున్నారు.
స్మార్ట్ హోం నెట్వర్క్
కేవలం టీవీ, నెట్, ఫోన్ కాకుండా ఇంటిని స్మార్ట్ హోంగా మార్చుకునేలా
కూడా రిలయన్స్ భారీ స్కెచ్ వేసింది. ఉదాహరణకు ఇప్పుడు ఇస్తున్న ఓఎన్‌టి బాక్స్‌కే
సిసిటివిని కూడా అనుసంధానించి.. సర్వేలెన్స్ ఫూటేజ్‌ను క్లౌడ్ ద్వారా చూసుకునే
వీలుంది. అంతేకాదు ఎక్కడి కూర్చునైనా... మన ఇంట్లోనో, ఆఫీసులో ఏం జరుగుతోందో తెలుసుకోవచ్చు.
దీంతో పాటు ఇంట్లోని వివిధ స్మార్ట్ ప్రోడక్టులను కనెక్ట్ చేసుకునే విధంగా
కూడా ప్లాన్ చేశారు. ప్లాన్‌ను బట్టి నెలకు రూ.1000లోపు ఈ సేవలన్నీ పొందేలా ఏర్పాట్లు ఉన్నాయి
1600 నగరాలకు విస్తరణ
ప్రస్తుతం దశల వారీగా ప్రాంతాలను కవర్ చేస్తూ వస్తున్న రిలయన్స్ త్వరలో 1600 నగరాలకు ఈ సేవలను అందించాలని చూస్తోంది. ఇందుకోసం అత్యంత వేగంగా పనులు
జరుపుతోంది. నాలుగైదేళ్ల నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చిన రిలయన్స్ ఇప్పుడు
పూర్తిస్థాయిలో అన్ని సేవలనూ అందించేందుకు సిద్ధమవుతోంది. అన్నీ అనుకున్నవి
అనుకున్నట్టు జరిగితే అటు మొబైల్, ల్యాండ్ లైన్, డిటిహెచ్ సేవల్లో ఉన్న వివిధ సంస్థలకు జియో ఎవరూ ఊహించనంత గట్టిపోటీ
ఇవ్వొచ్చు. ఎందుకంటే ఇప్పటికే వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్ కనెక్షన్లు దేశంలో 1.82 కోట్లు మాత్రమే ఉన్నాయి. అదే మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల సంఖ్య మాత్రం 5.31 కోట్ల మంది ఉన్నారు.