రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్రమోదీని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు కలవబోతున్నారు ? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే. ఎందుకంటే రెండుసార్లు ప్రధాని నరేంద్రమోదీని కలిసే అవకాశం ఉన్నా... తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఇందుకు సుముఖంగా లేరేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. సంపూర్ణ మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకావాల్సి ఉన్నా... విమానం ల్యాండింగ్ ఇబ్బంది అనే కారణంగా ఆ కార్యక్రమానికి కేసీఆర్ దూరంగా ఉన్నారు.
కేసీఆర్ నిజంగానే సాంకేతిక కారణాల వల్ల మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకాలేదా లేక మరేదైనా రాజకీయం కారణాలు ఉన్నాయా అనే అంశంపై రాజకీయవర్గాల్లో చర్చ కూడా జరిగింది. తాజాగా నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లకూడదని కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో... ప్రధానిని కలవడానికి సీఎం కేసీఆర్ నిజంగానే సుముఖంగా లేరేమో అనే ఊహాగానాలు మొదలయ్యాయి. నీతి ఆయోగ్ సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ వెళుతున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఈ భేటీకి వెళ్లొద్దని డిసైడయ్యారు. పరిపాలనపరమైన కారణాల వల్లే కేసీఆర్ ఢిల్లీ టూర్ వెళ్లడం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా... దీని వెనుక రాజకీయపరమైన కారణాలు ఉండొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది.
తెలంగాణలో బీజేపీ బలపడుతుండటం... అందుకు ఆ పార్టీ ప్రత్యేక శ్రద్ధ పెడుతుండటం కేసీఆర్ అసంతృప్తికి కారణం కావొచ్చని తెలుస్తోంది. ఈ కారణంగానే ఆయన ప్రధాని మోదీని కలిసే అవకాశాన్ని రెండుసార్లు వదులుకున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ హాజరై కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానిస్తారనే ప్రచారం జరిగింది. అయితే కేసీఆర్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
అయితే కేసీఆర్, ప్రధాని మోదీ మధ్య పెరిగినట్టు కనిపిస్తున్న గ్యాప్... టీఆర్ఎస్, బీజేపీ మధ్య పెరిగిన దూరాన్ని సూచిస్తోందనే ప్రచారం కూడా రాజకీయవర్గాల్లో సాగుతోంది. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా మారేందుకు బీజేపీ గట్టిగా ప్రయత్నాలు చేస్తుండటం వల్లే కేసీఆర్ ఆ పార్టీకి దూరంగా ఉండాలని భావిస్తున్నారేమో అనే టాక్ వినిపిస్తోంది. కారణాలు ఏమైనా... ప్రధాని మోదీని కలిసే విషయంలో కేసీఆర్ చేస్తున్న ఆలస్యానికి అసలు కారణం ఏమిటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు.