చంద్రబాబుతో ప్రశాంత్ కిశోర్ ఒప్పందం..!

Spoorthi
0

ఎన్నికల యాగం అయిపోయింది. కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి. విపక్షాలు మళ్లీ శక్తిని కూడదీసుకోడానికి తంటాలు పడుతున్నాయి. ఎన్నికల ముందు కళ్లు తెరిచేకంటే ఇప్పటి నుంచే జాగ్రత్తగా పావులు కదిపి గెలుపు జెండాను ఎగరేయాలనుకుంటున్నాయి. వాటికి ప్రశాంత్ కిశోర్ ఆపద్బాంధవుడిలా మారిపోయాడు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ కోసం పనిచేయాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ  అతనితో ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు రావడం తెలిసిందే.
తాజాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా పీకేతో ఒప్పందం చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీడీపీని బలోపేతం చేయడానికి తమ కోసం పనిచేయాలని బాబు ఆయనను ఒప్పించినట్లు జర్నలిస్టు సర్కిళ్లలో చర్చ జరుగుతోంది. పీకే, బాబు ఒప్పందం చేసుకున్నట్లు సీఎన్ఎన్-న్యూస్18 జర్నలిస్ట్ రిషికా కదమ్ ట్వీట్ చేశారు. కొన్నేళ్ల కాలానికి దీన్ని కుదుర్చుకున్నారని, చంద్రబాబు సన్నిహితుడైన టీడీపీ సీనియర్ నేత తనకు ఈ విషయం చెప్పారని ఆమె తెలిపారు. అయితే వందల కోట్లు తీసుకుంటారి భావించే పీకే బాబుతో ఎన్ని కోట్లకు ఒప్పందం చేసుకున్నారో తెలియడం లేదు. మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని గెలుపు గుర్రంపై పరిగెత్తించిన పీకే వచ్చే ఎన్నికల్లో తమకు గద్దె దక్కే చేస్తారని టీడీపీ ఆశిస్తున్నట్లు కనిపిస్తోంది. పీకే కూడా ఎవరికోసమైనా సరే పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు కనుక బాబు ఆయను సంప్రదించడంలో పెద్ద విశేషమేమీ లేదని భావిస్తున్నారు. అయితే ఒప్పందంపై అటు బాబుగాని, ఇటు పీకే టీమ్ గానీ ఇంతవరకు స్పందించలేదు. ఏపీ ఎన్నికల్లో తమ బలాన్ని, బలహీనలతను కనిపెట్టి జగన్‌తో కోలుకోలేని దెబ్బ కొట్టించిన పీకే వ్యూహాలు తమకు కలసి వస్తాయని పచ్చపార్టీ నేతలు భావిస్తున్నట్లు కనిపిస్తోంది.  

ఎన్నికలను వ్యూహాలను రచించడంలో రాటుదేలిన ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం జేడీయూ ఉపాధ్యక్షుడిగe ఉన్నారు. ఆయన ఇలా ఏ పార్టీకి పడితే ఆ పార్టీకి పనిచేయడం ఇష్టం లేనీ జేడీయూ ఆయనను పార్టీ నుంచి తప్పించాలని భావిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే పీకేకి రాజకీయాలు ద్వితీయ ప్రాధాన్యమని, ఆయన తొలి ప్రాధాన్యం ఎన్నికల వ్యూహాలేనని పరిశీలకులు చెబుతున్నారు. తన టీఎంకు నిత్యం ఏదో ఒక పని ఉండేలా ఆయన ఒప్పందాలు చేసుకుంటుంటారని అంటున్నారు.
Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top